ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా రెండవ విడతలో 50 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల నియమించారు. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో ఈ నెల 2న 62 నియోజక వర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా నియామకాలతో ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 112 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు నియమించినట్లయ్యింది. మిగిలిన నియోజకవర్గాలకు మరో విడతలో సమన్వయకర్తలను నియమించనున్నట్లు షర్మిల తెలిపారు.
