- కేంద్ర బడ్జెట్‌పై సిపిఎంరాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు వ్యాఖ్య
ప్రజాశక్తి- సీతారాం ఏచూరి నగర్ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి గుండు సున్నా తప్ప ఏమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విశ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. నెల్లూరులో సీతారాం ఏచూరి నగర్‌లో జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్‌కు ఎక్కువ నిధులు చూపారన్నారు.రాష్ట్ర రాజధాని అమరావతికి నిధులు ఏమీలేవన్నారు. గతంలో చెప్పినవే మళ్లీ చెబుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకూ నిధుల్లేవన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఊసే లేదన్నారు. దీన్ని పోర్టులకు అనుసంధానం చేస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రాభివృద్దికి నిధులు ఏమీ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సిఎం చంద్రబాబు కేంద్రం స్థితిని చూసి తలదించుకుంటారా?లేక కేంద్రంపై పోరాటం చేసి సంపాదించుకుంటారా?అనేది ఆయనే తేల్చుకోవాలన్నారు. కార్పోరేట్లకు మేలు చేసేలా ఉందే తప్ప సామాన్యులకు ఈ బడ్జెట్‌లో ఏమీలేదన్నారు.