ఎండలు తీవ్రం

Apr 13,2025 00:04 #gradually, #increasing, #intensity, #State, #sun
  • 30 మండలాల్లో వడగాడ్పులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో క్రమేపీ ఎండల తీవ్రత పెరుగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం 30 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 11, పార్వతీపురం మన్యం జిల్లాలో 10, ఏలూరు జిల్లా భీమడోలు, ఎన్‌టిఆర్‌ జిల్లా జి కొండూరు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 7, పార్వతీపురం మన్యం జిల్లాలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 2, ఏలూరు జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 11, ఎన్‌టిఆర్‌ జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 16, బాపట్ల జిల్లాలో 5, పల్నాడు జిల్లాలో 3 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం పల్నాడు జిల్లా రావిపాడులో 43.7 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగులో 43.4 డిగ్రీలు, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.8 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిన్నాయిగూడెంలో 42.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు.

➡️