హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కేవలం అపోహలపై ఆధారపడి దాఖలైందని.. ప్రతివాది రేవంత్‌రెడ్డి విచారణను ప్రభావితం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కాబట్టి ఈ దశలో పిటిషన్‌ను ఎంటర్‌టైన్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఒకవేళ భవిష్యత్తులో కనుక అలాంటి పరిస్థితి వస్తే పిటిషనర్ తమను ఆశ్రయించవచ్చని పేర్కొంది. అలాగే, కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్‌రెడ్డిని ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రాసిక్యూట్ చేయాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఓటుకు నోటు కేసు.. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
