- వైసిపి అధికార ప్రతినిధి పుత్తా
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన అంతా భజన, అబద్ధాల ప్రచారమని, 2014-19 మధ్య జరిగింది కూడా ఇదేనని వైసిపి అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్కడ ఆర్భాట ప్రకటనలు తప్ప పెట్టుబడులు లేవని పేర్కొన్నారు. ఒట్టి ప్రచారాలతో పారిశ్రామికవేత్తలు ముందుకు రారని, గతంలోనూ పెద్దయెత్తున ప్రచారం జరిగినా పెట్టుబడులు వచ్చిందేమీ లేదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలల్లో రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేసిందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్‌లో ప్రజలకు ఇచ్చిందేమీ అమలు చేయలేదని తెలిపారు. వైసిపి హయాంలో చేపట్టిన గ్రీన్‌కో ప్లాంటును ఇటీవల డిప్యూటీ సిఎం సందర్శించి గొప్ప కంపెనీ అని పొగిడారని వివరించారు.