జగన్‌ మాటలు ఈ శతాబ్దపు విడ్డూరం

– మంత్రి నిమ్మల రామానాయుడు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జగన్‌ విధ్వంసం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరమని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. విజయవాడలోని జలవనరులశాఖ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ తీసుకున్న పిచ్చి నిర్ణయాలతో ఆయన కంటే తుగ్లక్‌ మేలనే విధంగా ప్రజలు అభిప్రాయపడ్డారన్నారు. భవిష్యత్‌లో తుగ్లక్‌ బదులు జగన్‌ పేరును వాడుకునే విధంగా పాలన చేశారని విమర్శించారు. అభివృద్ధిని ఆపేసి ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను పీల్చిపిప్పిచేశారని, ప్రశ్నిస్తే హత్యలకు పాల్పడ్డారని అన్నారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టును ముంచేశారని, గత ఐదేళ్లలో అన్ని రంగాలూ పూర్తిగా దెబ్బతినిపోయాయని పేర్కొన్నారు. ప్రజల జీవన స్థితిగతులను అస్తవ్యస్తం చేసిన జగన్‌ను తెలుగు ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. అటువంటి జగన్‌ ఇప్పుడు నీతి వాఖ్యాలు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

➡️