తెలంగాణలో పది రోజుల పాటు థియేటర్లు మూసివేత..

May 15,2024 11:54 #Telangana, #Theaters to be closed

హైదరాబాద్‌ : తెలుగు సినిమా ఇండిస్టీలో వినూత్న పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం పెనుభారంగా మారడంతో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నుంచి పది రోజు పాటు సింగిల్‌ స్కీన్‌ థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌ల రాకతో కుదేలైన సింగల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలకు ఈ సమస్య శరాఘాతంలా తగినట్లైంది.

➡️