ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీ నుంచి ఓ సందర్శకుడు నగదు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగింది. కొంత డబ్బుల్ని తీసి అక్కడి నుంచి పారిపోగా.. ఈ చోరీ సీన్ మొత్తం హుండీ సమీపంలో ఉన్న సిసి కెమెరాలో రికార్డైంది. ఈ విషయాన్ని శ్రీవారి ఆలయంలో భద్రతా సిబ్బంది గమనించి సిసి ఫుటేజ్ ఆధారంగా యువకుడిని గుర్తించి గాలించారు. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. చోరీకి పాల్పడిన యువకుడు తమిళనాడులోని శంకరన్ కోవిల్‌కు చెందిన వేణు లింగంగా గుర్తించారు. అతడి దగ్గర నుంచి రూ. 13,870 డబ్బుల్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడిని టిటిడి విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు.