ఏపీలో బదిలీ అయిన పలువురు ఐఏఎస్‌లు వీరే..!

Aug 18,2024 07:43 #AP, #IAS, #transferred

అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మోప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా తేజ్‌ భరత్‌, చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా వి.అభిషేక్‌, పాడేరు సబ్‌ కలెక్టర్‌గా ప్రఖర్‌ జైన్‌, సబ్‌ కలెక్టర్‌ తో పాటు పాడేరు ఐటీడీఏ పీవోగా ప్రఖర్‌ జైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. కాకినాడ జాయింట్‌ కలెక్టర్‌గా రాహుల్‌ మీనా, అనంతపురం జేసీగా శివనారాయణ శర్మ, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌గా జి.విద్యార్థి, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా అశుతోష్‌ శ్రీవాస్తవ, అశుతోష్‌ శ్రీవాస్తవకు పార్వతీపురం ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు కేటాయించింది. ఏటిపాక సబ్‌ కలెక్టర్‌గా అపూర్వ భరత్‌, చిత్తూరు ఐటీడీఏ పీవోగా అపూర్వ భరత్‌కు పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

➡️