TDP మూడో జాబితాలో – 13 ఎంపి, 11 అసెంబ్లీ స్థానాలు

Mar 22,2024 22:55 #released, #TDP candidates, #third list

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:టిడిపి అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. ఈ జాబితాలో అసెంబ్లీ స్థానాలతో, లోక్‌సభ స్థానాలకూ టిడిపి అభ్యర్థులను ప్రకటించింది. 13 లోక్‌సభ, 11 శాసనసభ స్థానాలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం జాబితా విడుదల చేశారు. ఇంకా ఐదు శాసనసభ, నాలుగు ఎంపి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రజాభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని, ప్రజలు ఆశీర్వదించాలని చంద్రబాబు శుక్రవారం ఎక్స్‌(ట్విట్టర్‌)లో కోరారు.

అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

1. పలాస – గౌతు శిరీష

2. పాతపట్నం – మామిడి గోవింద్ రావు

3. శ్రీకాకుళం – గొండు శంకర్

4. శృంగవరపుకోట – కోళ్ల లలితా కుమారి

5. కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు

6. అమలాపురం(ఎస్సీ) – అయితాబత్తుల ఆనంద రావు

7. పెనమలూరు – బోడె ప్రసాద్

8. మైలవరం – వసంత వెంకట కృష్ణ ప్రసాద్

9. నరసరావుపేట – డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు

10. చీరాల – మద్దులూరి మాలకొండయ్య యాదవ్

11. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పార్లమెంట్ అభ్యర్థులు..

1. శ్రీకాకుళం – కింజారపు రామ్మోహన్ నాయుడు

2. విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్

3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్

4. ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్

5. విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని)

6. గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్

7. నరసరావుపేట – లావు శ్రీ కృష్ణ దేవరాయలు

8. బాపట్ల టి. కృష్ణ ప్రసాద్

9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

10. చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు

11. కర్నూలు – బస్తిపాటి నాగరాజు(పంచలింగాల నాగరాజు)

12. నంద్యాల – బైరెడ్డి శబరి

13. హిందూపూర్ – బీకే. పార్థసారధి.

➡️