- సాంస్కృతిక పోటీల్లో మూడో స్థానం
- బహుమతులు అందజేత
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రదర్శించిన శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు లభించిన బహుమతులను కేంద్ర మంత్రి అజరు భట్ చేతులమీదుగా రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, సమాచారశాఖ జెడి కిరణ్ కుమార్ స్వీకరించారు. పీపుల్స్ ఛాయిస్ విభాగంలో ఎపి శకటానికి, కళా ప్రదర్శనలకు తృతీయ బహుమతులు లభించాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న శకటాలకు నిర్వహించిన జ్యూరీ ఎంపికలు, దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ ఎంపికలలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన శకటాలకు రిపబ్లిక్ డే క్యాంపులో రక్షణశాఖ మంగళవారం బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించింది. పీపుల్ ఛాయిస్ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది.