తిరుమల లడ్డూ కల్తీ కేసు – నిందితులకు వైద్య పరీక్షలు

తిరుపతి : తిరుమల వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం కేసులో … అరెస్టయిన నలుగురు నిందితులకు తిరుపతి రుయా ఆస్పత్రిలో శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులు ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌, భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్‌ జైన్‌, పోమిల్‌ జైన్‌, శ్రీవైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్‌ చావ్డాను ఐదురోజులపాటు సిట్‌ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు గత గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయడంతో … ఈరోజు ఉదయం వారికి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం నిందితులను తిరుపతిలోని సిట్‌ కార్యాలయానికి తరలించారు. కస్టడీలో సిట్‌ అధికారులు పలు అంశాలపై వారి వద్ద నుండి వివరాలు రాబట్టనున్నారు. ఈరోజు నుంచి 18 వ తేదీ వరకు విచారణ జరగనుంది.

➡️