అమెరికా టారీఫ్‌లతో భారత ఫార్మాకు ముప్పు

Mar 27,2025 07:40 #BRS MP, #US tariffs

బిఆర్‌ఎస్‌ ఎంపి పార్ధసారధి రెడ్డి
న్యూఢిల్లీ : భారత ఫార్మా రంగంపై అమెరికా విధించనున్న సుంకాలపై బిఆర్‌ఎస్‌ ఎంపి బండి పార్ధసారధి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదిత సుంకాలు అమల్లోకి వస్తే భారత ఫార్మా పరిశ్రమకు తీవ్రమైన ఆర్థిక నష్టాలను కలిగించవచ్చని ఆయన రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సుంకాల వల్ల 30 లక్షల పైగా భారత ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లవచ్చన్నారు. 2023-24లో అమెరికాకు సుమారు రూ.74వేల కోట్ల విలువ చేసే ఔషధ ఉత్పత్తులను భారత్‌ ఎగుమతి చేసిందన్నారు. ఈ ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతున్నాయని ఇలాంటి సమయంలో పన్నుల పెంపు ఆందోళన కలిగిస్తోందన్నారు. భారత ఔషధ ఎగుమతుల్లో దాదాపుగా అమెరికా వాటా 31శాతంగా ఉందని పార్ధసారధి రెడ్డి గుర్తు చేశారు. ప్రపంచ ఫార్మసీగా పేరొందిన భారత ఔషధ పరిశ్రమ అమెరికా టారిఫ్‌ పెంపుతో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. భారత్‌కు విదేశీ మారక ద్రవ్య ఆదాయం తగ్గిపోవచ్చన్నారు.

➡️