అమరావతి : ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం మధ్య ప్రాంతాలు, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయంటే … ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది. మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాగల రెండు రోజుల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. తరువాత మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముంది. రాయలసీమలో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులేదు. తర్వాతి మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పముగా తగ్గే అవకాశముంది.
