ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లాలోని విడపనకల్లు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వైద్యులు ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్‌గా గుర్తించారు. వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.