విశాఖ రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి

Apr 4,2024 07:22 #road accident, #Visakha

ప్రజాశక్తి-విశాఖ : విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. టాటా ఎస్ వ్యాన్ ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో  అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిని విశాఖలోని కెజిహెచ్ కు తరలించారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

➡️