గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

తెలంగాణ : గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన బుధవారం హైదరాబాద్‌ నగరంలోని ఎల్బీ నగర్‌లో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సెల్లార్‌ కోసం గుంతలు తవ్వుతుండగా పక్కనే ఉన్న అదే స్థలానికి చెందిన ప్రహరీ గోడ కూలిపోయింది. శిథిలాల కింద నలుగురు చిక్కుకోగా, వారిలో ముగ్గురు చనిపోయారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులను వీరయ్య, రాము, వాసుగా గుర్తించారు. దశరథ అనే కార్మికుడికి కాలు విరిగింది. అతడిని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఖమ్మం జిల్లా సీతారామపురం తండాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️