అన్నమయ్య జిల్లాలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్‌

ప్రజాశక్తి-అన్నమయ్య : అన్నమయ్య జిల్లాలో యదేచ్ఛగా ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో సానిసాయ అటవీ ప్రాంతంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. నిందితులు సుండుపల్లి, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️