ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా టిడిపి నుంచి సానా సతీష్, బీదామస్తాన్‌రావు, బిజెపి నుంచి ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ బరిలో ఎవరూ లేకపోవడంతో వీరి ఎన్నిక లాంఛన ప్రాయమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం వెల్లడించారు. రాజ్యసభ సభ్యులుగా ఎనిుకైనట్లు ధ్రువీకరణ పత్రాలను ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల రిటరిుంగ్ అధికారి నుంచి అందుకున్నారు. తాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
