- హాజరుకానున్న మంత్రి కొండపల్లి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భువనేశ్వర్‌లో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం తరపున ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు. రెండు రోజులపాటు జరగనున్న ప్రవాస భారతీయ దినోత్సవం కార్యక్రమాన్ని తొలిరోజు గురువారం ఉదయం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసించే భారతీయ సంతతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు.