నేడు గరిమెళ్ల అంత్యక్రియలు

  • పోలీస్‌ లాంఛనాలతో చేయాలని ప్రభుత్వం ఆదేశం

ప్రజాశక్తి -తిరుమల : టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌ అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తిరుపతి గోవిందథామంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గరిమెళ్ల భౌతికకాయానికి నివాళి అర్పించిన వారిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ తదితరులు ఉన్నారు. అన్నమయ్య పాట ఉన్నంత వరకూ గరిమెళ్ల మన మధ్యే ఉంటారని ఆరణి శ్రీనివాసులు అన్నారు.

➡️