రేపు కళ్ళితండాకు జగన్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న సత్యసాయి జిల్లాలోని కళ్ళితండాకు వెళ్లనున్నారు. తండాకు చెందిన వీరజవాన్‌ మురళీనాయక్‌ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మురళీనాయక్‌ నివాసంలో ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు తిరిగి బయలు దేరుతారని పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

➡️