టన్ను తాబేళ్లు అక్రమ తరలింపు

  • పట్టుకున్న ఒడిశా అటవీశాఖ అధికారులు

ప్రజాశక్తి -సీలేరు (అల్లూరి జిల్లా) : ఆంధ్ర -ఒడిశా సరిహద్దు మల్కనగిరి జిల్లా కలిమెల ఎంవీ 79 రాజులు కొండ వద్ద సోమవారం అక్రమంగా తరలిస్తున్న టన్ను తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా అటవీశాఖ అధికారుల కథనం ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నర్సీపట్నం నుంచి మల్కనగిరి కలిమెలకు అక్రమంగా 35 సంచులతో చిట్టా గ్యాంగ్‌ రేంజు బల్మాలి నాయక బృందం అక్రమంగా తాబేళ్లు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రాజులకొండ వద్ద అటవీ శాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ వాహనాన్ని ి తనిఖీ చేయగా అందులోని 33 సంచుల్లో ఒక టన్ను తాబేళ్లు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని, తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఒడిశా అటవీశాఖ అధికారులు తెలిపారు.

➡️