జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో శ్రీచైతన్యకు టాప్‌ ర్యాంక్‌లు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ : ఐఐటి జెఇఇ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో తమ విద్యార్థులకు ఆల్‌ ఇండియా స్థాయిలో అగ్ర ర్యాంకులు దక్కాయని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఓపెన్‌ కేటగిరిలో తమ విద్యార్థులు పది లోపు ఐదు ర్యాంకులు సాధించారన్నారు. ఒక్కటవ ర్యాంక్‌తో పాటు ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 4,5,6,9,10,12,14 ర్యాంకులతో శ్రీచైతన్య ఆధిపత్యాన్ని కొనసాగించిందన్నారు. ఆలిండియా స్థాయిలో రాఘవ శర్మ 1వ ర్యాంక్‌, రిథమ్‌ కేడియా 4వ ర్యాంక్‌, పుట్టి కుశాల్‌ కుమార్‌ 5వ ర్యాంక్‌, రాజదీప్‌ మిశ్రా 6వ ర్యాంక్‌, ధృవిన్‌ హేమంత్‌ దోషి 9వ ర్యాంక్‌, సిద్విక్‌ సుహాన్‌ 10వ ర్యాంక్‌ల్లో నిలిచారని వెల్లడించారు. 100లోపు 30 ర్యాంక్‌లు, 1000 లోపు 202 ర్యాంక్‌లు, వివిధ కేటగిరీల్లో 100 లోపు ఏకంగా 146, 1000 లోపు 721 ర్యాంక్‌లు సాధించామన్నారు. జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో 3,728 మంది శ్రీచైతన్య విదార్థులు అర్హత సాధించారని తెలిపారు. ఈ దఫా ఐఐటిల్లో తొలి వరుసతో పాటు మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం శ్రీచైతన్యదేనని చెప్పారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి సుష్మ అభినందనలు తెలిపారు.

➡️