నేడు 9 జిల్లాల్లో భారీ వర్షాలు

Oct 3,2024 06:46 #havy rains, #rains, #vijayawadad
  • నిన్న విజయవాడలో దంచికొట్టిన వాన
  • విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వరదలతో విలవిల్లాడిన విజయవాడలో మరోమారు వర్షం బెంబేల్తించింది. బుధవారం పలుచోట్ల గంటల పాటు వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో ఈ నెల 3న గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 4న అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌, గుంటూరు, బాపట్ల, ప్రకాశంతోపాటు పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.

➡️