పెదనందిపాడు (గుంటూరు) : ఆటో, ట్రాక్టర్ ఢీకొట్టుకోవడంతో 10మంది వ్యవసాయ కూలీలకు తీవ్రగాయాలైన ఘటన మంగళవారం ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాలో జరిగింది. ఈరోజు ఉదయం శెనగను పీకే పని కోసం వ్యవసాయ కూలీలు బయలుదేరారు. పాలపర్తి కోల్డ్ స్టోరీ దగ్గరలో కూలీల ఆటోను, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. 3, 108 అంబులెన్స్‌లలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. వీరందరూ కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
