ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యం – ఆర్టీసీ బస్సు కిందపడి వ్యక్తి మృతి

తెలంగాణ : నగరంలోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. తనిఖీల్లో భాగంగా … ట్రాఫిక్‌ పోలీసులు బైక్‌ను ఆపడానికి యత్నించారు. ఈ క్రమంలో బైక్‌ అదుపు తప్పడంతో వాహనదారుడు కిందపడ్డాడు. అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తల పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వాగ్వాదానికి దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు.

➡️