చేపమందు పంపిణీలో విషాదం

  • గుండెపోటుతో వ్యక్తి మృతి

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగిన చేప మందు పంపిణీ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. క్యూలైన్‌లో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అబిడ్స్‌ ఎసిపి చంద్రశేఖర్‌, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన గొల్ల రాజన్న (60) చేపమందు తీసుకోవడానికి మనవడితో కలిసి శుక్రవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు వచ్చారు. శనివారం ఉదయం 6:30 సమయంలో క్యూ లైన్‌లో స్పహ కోల్పోయారు. అతన్ని అంబులెన్స్‌లో పక్కనే ఉన్న కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడు గుండెపోటుతో చనిపోయారని, అతనికి ఆస్తమా ఉందని వైద్యులు తెలిపారు.

➡️