ప్రజాశక్తి-చిత్తూరు : సంక్రాంతి పండుగ వేళ చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడు కరెంట్ షాక్‌తో మృతి చెందగా.. మరో బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రగిరి పట్టణం బీడీ కాలనీలో సమీర్(12) అనే బాలుడు మరో బాలుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో పక్కనే ఉన్న సమీర్‌పై మేనమామ షబ్బీర్ కోపంతో గదిలో పెట్టి గొళ్ళెం వేశాడు. భయంతో సమీర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మదనపల్లెలో గాలిపటం ఎగరవేస్తున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టడంంతో మరో బాలుడు మృతి చెందాడు.
