ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మాదక ద్రవ్యాల కట్టడికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, దర్యాప్తులో తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలపై ఇన్‌స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారులకు ఒకరోజు శిక్షణ తరగతులు అక్కయ్యపాలెంలోని కస్టమ్స్, జిఎస్‌టి, నార్కోటిక్స్ జాతీయ శిక్షణ సంస్థలో బుధవారం జరిగినట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఈదర రవికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్ డైరెక్టర్ ఆర్ రవికృష్ణ, విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టీ పాల్గొన్నారు.
