16 మంది ఐపిఎస్‌లు బదిలీ

Sep 26,2024 00:12 #andrapradesh, #ips, #Transfer
  •  అనకాపల్లి ఎస్‌పిగా తుహీన్‌ సిన్హా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 16 మంది ఐపిఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిఐడి ఐజిగా ఎస్‌ఐబి ఐజిగా వున్న వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను, సెబ్‌ డైరెక్టరు ఎం రవిప్రకాశ్‌ను పిఅండ్‌ఎల్‌ ఐజిగా, పిఅండ్‌ఎల్‌ ఐజిగా వున్న రామకృష్ణను ఇంటెలిజెన్స్‌ ఐజిగా వేశారు. వెయిటింగ్‌లో వున్న అమ్మిరెడ్డిని డిజిపి కార్యాలయ అడ్మిన్‌గా వేశారు. రోడ్‌ సేఫ్టీ అథారిటీ డిఐజిగా సిహెచ్‌ విజయరావు, ఇంటెలిజెన్స్‌ ఎస్‌పిగా ఫకీరప్ప, శాంతిభద్రతల ఎఐజిగా సిద్ధార్థ్‌ కౌశల్‌, విశాఖ శాంతిభద్రతల డిసిపిగా మేరీ ప్రశాంతి, అనకాపల్లి ఎస్‌పిగా తుహిన్‌ సిన్హా, పిటిఒ ఎస్‌పి కెఎస్‌ఎస్‌వి సుబ్బారెడ్డికి పోస్టింగ్‌ ఇచ్చారు. అలాగే ఎన్‌టిర్‌ కమిషన రేట్‌లో క్రైమ్‌ డిసిపిగా తిరుమలేశ్వరరెడ్డి, ఎపిఎస్‌పి 3 బెటాలియన్‌ కమాండెంట్‌గా దీపక్‌, ఒంగోలు పిటిసి ప్రిన్సిపల్‌గా జి రాధిక, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్‌పిగా అరిఫ్‌ హఫీజ్‌లను నియమిం చారు. అలాగే బాపూజి అట్టాడ, శ్రీనివాసరావుకు పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

➡️