ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం 32మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం సిఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొతం ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు సిఆర్డిఎలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రొటోకాల్ డైరెక్టర్‌గా టి.మోహన్‌రావును, ఎపిఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పి.రచనను నియమించారు.
శ్రీకాళహస్తి దేవాలయం ఇఓగా టి.బాపిరెడ్డిని నియమించారు. శిల్పారామం సొసైటీ సిఇఓగా వి.స్వామినాయుడును నియమించారు. సిసిఎల్ఎ సహాయ కార్యదర్శిగా డి లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.