66 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రభుత్వం 66 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ, పోస్టింగ్‌లకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శుక్రవారం జిఓ ఆర్‌టి నెంబరు 2033ను విడుదల చేసింది. పలు జిల్లాల్లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వీరిలో కొందరికి డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇవ్వగా, ఒకరిద్దరిని ఆలయాలకు ఇఒలుగా నియమించారు. మిగిలిన వారిని ఆయా జిల్లాల్లో అవసరాన్ని బట్టి వివిధ రకాల పోస్టులకు బదిలీ చేసింది.

➡️