టిడిపి నేత హత్యతో సిఐ, ఎస్‌ఐ బదిలీ

Jun 10,2024 22:23 #Kurnool, #muder case, #police, #transfers
  • బాధ్యతలు స్వీకరించిన కొత్త సిఐ, ఎస్‌ఐ

ప్రజాశక్తి-వెల్దుర్తి : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం జరిగిన టిడిపి నాయకుడు గిరినాథ్‌ చౌదరి హత్య నేపథ్యంలో వెల్దుర్తి సిఐ, ఎస్‌ఐలను అధికారులు సోమవారం బదిలీ చేశారు. గిరినాథ్‌చౌదరిని వైసిపి కార్యకర్తలు హత్య చేశారు. ఈ ఘటనపై సిఐ సురేష్‌ కుమార్‌ రెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి విధులలో నిర్లక్ష్యం వహించారంటూ వారిని విఆర్‌కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారి స్థానంలో వెల్దుర్తి సిఐగా కర్నూలు సర్కిల్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మధుసూదన్‌ రావును, ఎస్‌ఐగా కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సునీల్‌ కుమార్‌ను నియమించారు. దీంతో వారు బాధ్యతలు స్వీకరించారు.

హత్య కేసులో 16 మందిపై కేసు నమోదు
హత్య గురైన గిరినాథ్‌ చౌదరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వైసిపి కార్యకర్తలు రమేష్‌, రామకృష్ణలతో కలిపి 16 మందిపై కేసు నమోదు చేసినట్లు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ మధుసూదన్‌ రావు, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. హత్యకు కారకులైన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఈలోపు వెల్దుర్తి మండల ప్రజలు,. ఇరు పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఎటువంటి ఘర్షణలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలో పోలీసు బందోబస్తుతో పికెటింగ్‌ ఏర్పాటు చేశామని, ఏవైనా ఘర్షణలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

➡️