Senior IAS అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ

Jun 25,2024 07:41 #ap government, #IAS, #transferred

ప్రజాశక్తి-అమరావతి : సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇటీవల వ్యవసాయ, గనుల శాఖ నుంచి ఆయన్ను కార్మిక శాఖకు బదిలీ చేశారు. అయితే కార్మికశాఖ బాధ్యతలు అప్పగించడంపై పాలనావర్గాల్లో విస్మయం వ్యక్తమైనట్లు సమాచారం. ఆయన వైసీపీకి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ద్వివేదిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులుజారీ అయ్యాయి.

➡️