తెలంగాణ : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, నల్గండ కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా హన్మంతరావు బదిలీ అయ్యారు. వీరితోపాటు ముగ్గురు ఐఎఫ్‌ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మేడ్చల్ జడ్పీ సీఈవో, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ లీప్ కుమార్ బదిలీ అయ్యారు. సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా మందా మకరందు, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా ఎస్ హరీష్ రావు, మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌గా టీకే శ్రీదేవి బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.