ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పలువురు డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టింగులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం జిఓ ఆర్‌టి నెంబరు 34ను విడుదల చేసింది. ఇటీవల పలువురు ఐఎఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా 17 మంది డిప్యూటీ కలెక్టర్లలో కొందరిని బదిలీ చేయగా, పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న మరికొందరికి పోస్టింగులు ఇచ్చింది.