ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటుపై త్రిసభ్య కమిటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఇడి వీధి దీపాల ప్రాజెక్టు కోసం త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్రిసభ్య కమిటీలో పిఆర్‌ అండ్‌ ఆర్‌డి కమిషనర్‌ కృష్ణతేజ, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ జెఎమ్‌డి చేకూరి కీర్తికి స్థానం కల్పించారు. త్రిసభ్య కమిటీ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి పది రోజుల లోపు ప్రాజెక్టుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

➡️