- ‘అవినీతి కిలాడీలు’ సంచికకు ప్రజల్లో విశేష స్పందన
ప్రజాశక్తి-ఒంగోలు : ‘అవినీతి కిలాడీలు.. రక్షణలో పాలకులు’ పేరుతో ‘ప్రజాశక్తి’ ప్రచురించిన ప్రత్యేక సంచికకు ప్రజల్లో విశేష స్పందన వస్తోంది. ఈ సంచికను ఒంగోలు నగరంలో ప్రజాసంఘాల నాయకులు షాపుషాపునకు తిరిగి విక్రయించారు. విద్యుత్ భారాలపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న వ్యాపారులు.. ఆ భారాలకు కారణాలు, కారకులైన వారి గురించి ప్రచురించడం పట్ల ‘ప్రజాశక్తి’ని అభినందించారు. ఇలాంటి కథనాలు, వాస్తవాలు ప్రచురించటం ‘ప్రజాశక్తి’క సాధ్యమని కితాబిచ్చారు. సోమవారం నాడు ఒంగోలులోని కర్నూలు రోడ్డు, గాంధీ రోడ్డు, ట్రంక్ రోడ్డు, పత్తివారి వీధి, తదితర ప్రాంతాలలో వ్యాపారులకు ఈ ప్రత్యేక సంచికల విక్రయాలు నిర్వహించారు. మంచి ఆదరణ లభించింది.