తెలంగాణ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్‌ను అధికారులు ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ లో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూన్ 4, 5 తేదీల్లో మొత్తం 3 సెషన్లలో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550, ఇతరులకు రూ.750 గా అధికారులు నిర్ణయించారు. అపరాధ రుసుంలో మే నెల 17 వరకు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. సీబీటీ విధానంలో పరీక్ష జరగనుండగా మే 20వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ 28 న తుది ఫలితాలు వెలువడనున్నాయి.
