ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి అర్బన్ ఎస్‌పి హర్షవర్ధన్ రాజుకు టిటిడి ఫిర్యాదు చేసింది. ఎస్‌వి గోశాలలో గోవుల మృతిపై అసత్య ఆరోపణలు చేసిన కారణంగా కేసు నమోదు చేయాలని పోలీసులను పాలకమండలి సభ్యులు జి భాను ప్రకాశ్ రెడ్డి ఫిర్యాదులో కోరారు. ఎస్‌వి గోశాలలో వంద గోవులు మరణించాయంటూ, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
