ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రత అధికారిగా (సివిఎస్‌ఒ) ఎస్ శ్రీధర్ బుధవారం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్‌పిగా పనిచేసిన శ్రీధర్ బదిలీ నిమిత్తం టిటిడి ముఖ్య భద్రతాధికారిగా బదిలీ అయ్యారు. బుధవారం శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఆలయంలోనే ఆయన బాధ్యతలు స్వీకరించారు.
