వారం సెలవుపై టిటిడి ఇఒ ధర్మారెడ్డి

Jun 10,2024 22:39 #TTD EO, #TTD EO Dharma Reddy
  • రాష్ట్రం దాటి వెళ్లకూడదని షరతు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం ఇఒ ధర్మారెడ్డి వారం రోజులు సెలవుపై వెళ్లారు. ఈ నెల 11 నుంచి 17 వరకు వ్యక్తిగత పనుల కోసమంటూ సెలవుకు దరఖాస్తు చేయగా, సిఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ సెలవును మంజూరు చేశారు. ఈ వారం రోజులు రాష్ట్రం విడిచి వెళ్లరాదని, హెడ్‌ క్వార్టర్స్‌లో మాత్రమే ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇఒపై జనసేన నేతలు తిరుపతిలో ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి పాఠకులకు విధితమే. నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణస్వీకారోత్సవం చేసిన అనంతరం తిరుమలకు వెళ్లనున్నారు. అదేరోజు రాత్రి అక్కడే బస చేసి 13న ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇఒ సెలవు పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

➡️