బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు అరెస్టు

Mar 20,2025 22:48 #arest, #gannavaram, #rape case

ప్రజాశక్తి – గన్నవరం : కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ఎస్‌పి ఆర్‌.గంగాధరరావు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించామని చెప్పారు. వీరిలో వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన బాణావతు లక్ష్మణ జితేంద్ర కుమార్‌, పగడాల హర్షవర్ధన్‌ను అరెస్టు చేశామని వివరించారు. మిగిలిన ఆరుగురు నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

➡️