ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు..

Jun 8,2024 18:02 #AP, #mourning, #two days

అమరావతి: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మఅతికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా ప్రకటిస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రామోజీ అంత్యక్రియలు రేపు రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది.

➡️