రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Jun 9,2024 18:05 #road accident, #Two died

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది దగ్గర జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారును రెండు లారీలు ఢకొీట్టడంతో నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. ఒక బాలుడు మాత్రం కారులోనే ఇరుక్కుపోయి దాదాపు రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు.కారు ముందు భాగంలో కాళ్లు ఇరుక్కుపోయి విలవిల్లాడుతున్న బాలుడిని చూసిన స్థానికులు అతన్ని రక్షించేందుకు చాలాసేపు శ్రమించారు. ఒకవైపు ధైర్యం చెబుతూనే.. జేసీబీ, గునపాల సాయంతో అతి కష్టం మీద బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

➡️