ప్రజాశక్తి- బనగానపల్లె (నంద్యాల) : నంద్యాల జిల్లా బనగానలపల్లె మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు తప్పిపోయారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. తిమ్మాపురం మజరా గ్రామం జిల్లెల్లకు చెందిన సూరబోయిన యేసు రత్నం కుమార్తె సూరబోయిన కల్పన.. నందివర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. సూరబోయిన మోహన్ కుమార్తె కీర్తి.. పాణ్యం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. పాఠశాలలకు వెళ్తున్నామని ఇద్దరూ తమ ఇళ్ల నుంచి సోమవారం బయటకు వచ్చారు. సాయంకాలం తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకసాగారు. విద్యార్ధులిద్దరూ పాఠశాలలకు వెళ్లలేదని తేలడంతో కల్పన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
