రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Apr 4,2024 16:06 #Kakinada, #road accident

ప్రజాశక్తి – కాకినాడ : గురువారం  గండేపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు  మృతి చెందారు.  గండేపల్లి మండలంలో  తాళ్లూరు గ్రామం జాతీయ రహదారిపై ఈ  ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై  ఆగి ఉన్న లారీని విశాఖపట్నం వైపు నుండి రాజమండ్రి వెళుతున్న కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడకక్కడే మృతి చెందారు.  చనిపోయిన వారిని తమ్మిన సుబ్రహ్మణ్యం (42), చేకూరి పల్లయ్య చౌదరి (53)లుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనా
స్థలానికి ఎస్సై ఎన్ రామకృష్ణ సిబ్బందితో వెళ్లి హుటాహుటిన మృతదేహాలను బయటకు తీసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

➡️