ప్రజాశక్తి- వాకాడు (తిరుపతి జిల్లా) : విహార యాత్రలో విషాదం నెలకొంది. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తూపిలి పాలెం వద్ద బంగాళాఖాతం తీరంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసుల వివరాల మేరకు.. సమీప గ్రామాలకు చెందిన యువకులు ఎనిమిది మంది ఆటోలో విహారయాత్రకు వచ్చారు. వారిలో ఇద్దరు అలల తాకిడికి కొట్టుకుయారు. ఒకరు వాకాడు మండలం వడపాలెం గ్రామంకు చెందిన లోకేష్ (18), మరొకరు చిట్టమూరు మండలం కుక్కుపాలెం గ్రామానికి చెందిన భాను ప్రకాష్ (18)గా గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.