ఆదిలాబాద్‌లో లారీని ఢీ కొన్న ప్రైవేట్‌ బస్సు.. ఇద్దరు మృతి

Mar 9,2025 09:17 #2 death, #acidnet, #road acidnet

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా జందాపూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్‌ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ తోపాటు మరొకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది.. క్షతగాత్రులను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్‌ నుంచి నాగ్పుర వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️